27, ఆగస్టు 2012, సోమవారం

*Office 2013 లో Save చెయ్యని files ని recover చేయండిలా

ప్రస్తుతం MS Office 2013 Customer Preview ని వాడుతున్నవారు ఇంతకు ముందు మీరు save చెయ్యనటువంటి recent (ఇంచుమించు 4  రోజుల క్రితం వీ మాత్రమే) డాక్యుమెంట్స్ ని అంటే, Unsaved files ని  easy గా ఒక్క నిమిషంలో recover చేసి ఏ విధంగా save చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం. 

ముందుగా File --- Open --- Recent Documents (Word లో)/ Recent Presentations (PowerPoint లో)/ Recent Workbooks (Excel లో)  మీద క్లిక్ చేసి, అక్కడ ఉన్న Recover Unsaved Documents (Word లో)/ Recover Unsaved Presentations (PowerPoint లో)/ Recover Unsaved Workbooks (Excel లో) ని ఎన్నుకోండి. 




Actual గా మనం save చెయ్యని Office డాక్యుమెంట్స్ అన్నీ ఈ location (C:\Users\YourUserName\AppData\Local\Microsoft\Office\UnsavedFiles) లో drafts లాగా save అవుతాయి.

ఇప్పుడు open అయిన window లో ఉన్న మీ unsaved డాక్యుమెంట్ ని ఎన్నుకొని Open మీద క్లిక్ చేయండి. 
దీంతో ఆ unsaved డాక్యుమెంట్ ఇంకో window లో open అవుతుంది. 

ఇప్పుడు అక్కడ ఉన్న Save As మీద క్లిక్ చేసి, ఇక మనం మామూలుగా ఒక డాక్యుమెంట్ ని ఏ విధంగా save చేస్తామో ఆ విధంగా ఆ unsaved డాక్యుమెంట్ ని save చెయ్యాలి. అంతే. 



Tip: ఎం ఎస్ ఆఫీసు 2013 కస్టమర్ ప్రివ్యూ ని మీరు వాడాలనుకుంటే గనక మైక్రోసాఫ్ట్ వారి website లో windows live ID తో login అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీకు windows live ID లేకపోతే ఎం ఎస్ ఆఫీసు 2013 కస్టమర్ ప్రివ్యూ యొక్క Standalone Offline Installer files ని  మీరు direct గా ఈ links నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.   

డౌన్లోడ్:
64-bit (x64) Download (702 MB)          
32-bit (x86) Download (624 MB) 

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com