*తెలుగు లో లభించే కంప్యూటర్స్ సమచార మాస పత్రికలు
ఈ రోజు నేను ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పలనుకుంటున్నాను. ఇది వరకే మీలో కొందరికి ఈ విషయాలు తెలిస్తే ఫర్వాలేదు కాని తెలియని వారు దయచేసి ఈ క్రింది విషయాలు జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసిందిగా మీమ్మల్ని కోరుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఈ టపా వ్రాస్తున్నాను.
తెలుగు లో కంప్యూటర్స్ గురించి తెలుసుకో్వాలనుకుంటున్నవారందరికి తెలుగులోనే కంప్యూటర్స్ గురించిన సమచారం అందించే కంప్యూటర్స్ సమచార మాస పత్రికలు (Monthly Magazines) చాలానే మార్కెట్లో లభిస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు వాటిలో కొన్ని ఈ క్రిందివి చాలా ముఖ్యమైనవి.
- కంప్యూటర్స్ ఫర్ యు (Computers for U) మాస పత్రిక
- కంప్యూటర్ ఎరా (Computer Era) మాస పత్రిక
- కంప్యూటర్ విఙ్నానం (Computer Vignanam) మరియు
- ఈనాడు పేపర్ లోని ప్రతి గురువారం వచ్చే ఈ-నాడు (e- నాడు) ప్రత్యేక్య పేజీ సంచిక
ఇవన్నీ మీ దగ్గరలోని ఏ ప్రముఖ బుక్ షాపుల్లోనైన దొరుకుతాయి. ఒకోక్కటి కేవలం రూ. 20/- లోపే మీకు లభిస్తాయి. ప్రతి నెలా బుక్ షాపుల్లో అక్కడికి వెళ్ళి కొనేకంటే సంవత్సరంతానికి సరిపడ చందా డబ్బు ఒకేసారి మనీ అర్డర్ ద్వారా అయా మాస పత్రికల పబ్లికేషన్స్ చిరునామా కు పంపితే ప్రతి నెలా ఈ మాస పత్రికలు మీ ఇంటికే పోస్టు ద్వారా వస్తాయి.
Computers for U వారి చిరునామా: సంవత్సరం చందా Rs.180/-
Computer Era వారి చిరునామా: సంవత్సరం చందా Rs.240/-
2-2-1130/24/1/D/1, 305, Besides Indian Bank, Shivam Road , New Nallakunta, Hyd - 500 014, A.P.
స్నేహితులారా, ఇకమీదట ఇవే కాక నా దృష్టి కి వచ్చే ఇలాంటి మాస పత్రికలకు సంబందించిన ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తాను. సొ, బై ఫర్ నౌ.
1 comments:
Nice information for a lay man like me.Thanq v.much.....Nutakki Raghavendra rao
కామెంట్‌ను పోస్ట్ చేయండి